భారతీయ భాషల ద్వారా విజ్ఞానం

भारतीय भाषाओं द्वारा ज्ञान

Knowledge through Indian Langauges

Search Dictionaries

Loading Results

సామాన్య ప్రశ్నోత్తరాలు

భారతవాణి యోజన గురించి ప్రజలకు సమాచారం

భారతవాణి అంటే ఏమిటి? దాని ఉద్దేశ్యం ఏమిటి?

  • భారతవాణి అనేది ఒక యోజన/ప్రాజెక్టు. దీని ఉద్దేశ్యం మల్టీమీడియా (టెక్స్ట్, దృశ్య, శ్రావ్య, ఇమేజస్)ను ఉపయోగించి భారతీయ సమస్త భాషల గురించి మరియు భాషలన్నింటిలో ఉన్న జ్ఞానాన్ని పోర్టల్ (వెబ్‍సైట్)లో సమకూర్చడం. ఇది పరస్పరమైన, గతిశీల మరియు ఆధునికమైన అంశాల సమ్మేళనం. దీని ముఖ్య ఉద్దేశ్యం డిజిటల్ భారతయుగంలో భారతదేశాన్ని స్వేఛ్ఛా జ్ఞాన సమాజం చేయడం.

భారతవాణి జ్ఞాన పోర్టల్ ద్వారా ప్రయోజనం పొందేవారెవరు?

  • భారతవాణి సమాజంలోని అన్ని వర్గాలవారు లింగ, వయస్సు, నేపథ్యం, విద్యాభ్యాసము మరియు ఆర్థిక పరమైన (నిర్ణీత మరియు అనిర్ణీత) భేదం లేకుండా అందరూ ఉపయోగించదగినది. ఈ విధంగా భారత పౌరులందరికి భారతవాణి సేవలను అందిస్తుంది.

భారతవాణిలో సమకూర్చే విషయాలు ఎలా తీసుకున్నారు?

  • భారతవాణి అనుకున్న భాషలన్నింటిలో జ్ఞాన సమాచారాన్ని మల్టీమీడియా రూపంలో అన్ని ప్రభుత్వ మరియు ప్రభుత్వేతర సంస్థలు, విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాలు, గ్రంథాలయాలు, ప్రచురణ సంస్థల నుంచి సేకరిస్తుంది.
  • అదేవిధంగా భారతవాణి ప్రైవేటు సంస్థలను కూడా వారి దగ్గర ఉన్న జ్ఞానసమాచారాన్ని నిత్యం ఆన్ లైన్ లో ఉపయోగించడానికి ఇందులో భాగం చేయాల్సిందిగా కోరుతుంది.
  • విషయాల నిర్ధారణ మరియు ఎంపికలకు సంబంధించిన అంగీకారాలను ఒక దగ్గర చేర్చడం జరుగుతుంది. చివరకు సంపాదకీయ సమితి సూచించిన సిఫారసులపై చివరి నిర్ణయం సలహా సమితి తీసుకుంటుంది.
  • భారతవాణి ముఖ్య ఉద్దేశ్యం జ్ఞాన సమాచార ప్రచురణ. కాని ఇది సలహా సమితి సూచించినట్లయితే ప్రత్యేక పద్ధతి ప్రకారం ప్రాతినిధ్య అకల్పిత విషయాలను కూడా ప్రచురిస్తుంది.

భారతవాణి విషయాల నాణ్యతను ఎలా నిర్ధారిస్తుంది?

  • భారతవాణి వివిధ రంగాలలో నిపుణులు వ్రాసిన విషయాలను మరియు భారతీయ భాషా సంస్థ మొదలుకొని ప్రసిద్ధ సంస్థలు ప్రచురించిన విషయాలను ప్రచురిస్తుంది.
  • కొత్తగా వచ్చిన విషయాలను ప్రచురించడానికి భారతవాణిలో ప్రతి భాషకై ఒక సంపాదకీయ సమితి ఉంటుంది.
  • తప్పులులేని సమాచారాన్ని ప్రచురించండానికి అన్ని రకాల విధానాలను అవలంబించడం జరుగుతుంది.

భారతవాణి భాషా సాంకేతిక పరికరాలను ప్రచురిస్తుందా?

  • భారతవాణి వాటికి సంబంధించి ఒక వేదికను ఏర్పరిచి అందులో భారతీయ భాషలకు సంబంధించి అందుబాటులో ఉన్న, సవరించిన సాంకేతిక పరికరాలను సమకూరుస్తుంది. ఇది వివిధ అనుబంధ TDIL వంటి శాఖల సహాయంతో పరికరాలు తయారు చేస్తున్న సాంకేతిక సమాచారం మరియు సంభాషణ మంత్రిత్వ శాఖ (MCIT)లకు సహకరిస్తుంది. భాషా పరికరాలు: ఫాంట్స్‍, సాఫ్ట్‍వేర్, ముద్రాలేఖన సాధనం, మోబైల్ ఆప్స్, బహుభాష అనువాద సాధనం, రాత నుంచి మాట, మాట నుంచి రాత మొదలయిన వాటిని అందుబాటులోకి తెస్తుంది.

భారతవాణి వలన సమాజానికి కలిగే ప్రయోజనాలు ఏమిటి?

  • భారతవాణి అన్నీ భారతీయ భాషలు/మాతృభాషలను అంతర్జాలంలో విస్తృతంగా భారీ స్థాయిలో కనపడేలా అందరికీ లభించేలా చేస్తుంది. దీని వలన ప్రజలు, యువకులు అంతర్జాలంలోని అన్నీ రకాల బ్లాగింగు, నేర్చుకోవడం, తదితర సామాజిక మాధ్యమాల్లో తమ మాతృభాషను ఉపయోగించేలా సంభవిస్తుంది.
  • అంతరించిపోతున్న, స్వల్ప, అల్పసంఖ్యాక మరియు గిరిజన భాషలు/మాతృభాషలకు భారతవాణి సైబర్ ప్రపంచంలో సముచిత స్థానం కల్పిస్తుంది.
  • అన్నీ భాషలను/మాతృభాషలను ఒక దగ్గర కూర్చటం ద్వారా భారతదేశంలోని అన్ని జన సముదాయాలను భారతవాణి ఒక్కరీతిగా కలుపుతుంది. అలాగే భారతదేశ నలుమూలలకు చేరి సాంస్కృతిక అవగాహనను పెంపొందిస్తుంది.

 ప్రభుత్వ సమాచారాన్ని భారతవాణి ప్రచురిస్తుందా?

  • భారతవాణి యోజనను వ్యవసాయ, వ్యాపార, విద్య, సామాజిక రంగం, మరియు సకాల సేవలు, ఇతరముఖ్యమైన /అవసరమైనపోర్టల్సుకు అడ్డలంకెతో కలిపి తద్వారా పౌరులందరికీ ఒకే పోర్టల్ ద్వారా సంబంధితవిజ్ఞానం మరియు సమాచారం లభించేలా చేస్తుంది.

భారతవాణి యోజనలో ఇప్పుడు ఏ భాషలను చేర్చారు?

  • మొదటి ఏడాది 22 షెడ్యూల్డు భాషలను (అస్సామి, బెంగాలీ, బోడో, డోగ్రీ, గుజరాతీ, హిందీ, కన్నడ, కాశ్మీరీ, కొంకణీ, మలయాళం, మణిపురి, మైథిలీ, మరాఠీ, నేపాలీ, ఒడియా, పంజాబీ, సంతాలీ, సంస్కృతం, సింధీ, తమిళం, తెలుగు మరియు ఉర్దూ) చేరుస్తారు. ఆ తర్వాత ఇతర భాషలను అంచెల వారీగా చేరుస్తారు.

భారతవాణి యొక్క భౌతిక లక్ష్యాలు ఏమిటి? భారతవాణిలో ఏ రకమైన విషయాలను ప్రచురించ బోతున్నారు?

  • భారతవాణి మొదటి రెండు సంవత్సరాలలో ముఖ్యమైన అంశాల జాబితా ఆధారంగా విజ్ఞాన విషయాలను అభివృద్ధి చేయటం కోసం పనిచేస్తుంది. ఆ తర్వాత  వచ్చే ఐదు సంవత్సరాలలో ప్రతి భాష/మాతృభాషలలో ప్రత్యేక విషయాల రూపకల్పనే లక్ష్యంగా పనిచేస్తుంది.  ప్రారంభంలో వివిధ భాషలలో అందుబాటులో ఉన్న విషయాలను ప్రచురించటానికి కృషి చేస్తుంది.

భారతవాణి కింద పేర్కోన్న వాటి కొరకు పనిచేస్తుంది.

  1. భాషా సాహిత్యాలను డిజిటల్/ఎలక్ట్రానిక్ రూపంలో భద్రపరచటం.
  2. లిపులు, అక్షరస్వరూపాలకు సంకేత లిపులను రూపోందించటం/సూత్రీకరించటం.
  3. నిఘంటువులను మరియు పదకోశాలను తయారుచేయటం.
  4. సాహిత్య (రచన మరియు మౌఖిక) మరియు విజ్ఞాన విషయాలను ఆధునిక మరియు ప్రాచీన భాషలలోకి అనువదించడం.
  5. అంతర్జాలం ద్వారా భాషలను బోధించడం, నేర్పడం మరియు భాషా ఉపాధ్యాయ శిక్షణలను ధృవీకరణ పత్రంతో అందిచడం మరియు అంతర్జాలం ద్వారా భాషల పరీక్షలు మరియు మూల్యాంకనాలను నిరంతరంగా సమగ్రంగా నిర్వహించడం జరుగుతుంది.

భారతవాణి ప్రచురించే విషయాలు ఉచితంగా అందుబాటులో ఉంటాయా?భారతవాణి ప్రచురణ హక్కులను (copyright) ఏ విధంగా కాపాడుతుంది?

  • భారతవాణి అనేది ప్రజలకు ప్రత్యేకించి భారతీయులకు జ్ఞానాన్ని పంచే ఉద్దేశంతో ఏర్పడిన నవీన మహాద్వారం (Portal). భారతవాణి మహాద్వారంలో లభించే అన్నీ విషయాత్మక అంశాలను విద్యా మరియు పరిశోధనల కోసం ఉచితంగా ఉపయెగించుకోవటానికి లభిస్తాయి.
  • భారతవాణి మహాద్వారం భారత ప్రచురణ (Copyright) హక్కుల చట్టం-1957కు కట్టుబడి ఉండి, సెక్షన్-52 కింద ప్రచురణ (Copyright) హక్కులకు ఉల్లంఘన జరగని విధంగా నిర్దుష్టమైన కార్యాకలాపాలు నిర్వహిస్తుంది.

భారతవాణి యోజనకు ప్రభుత్వేతర సంస్థలు మరియు వ్యక్తులు కూడా తోడ్పడవచ్చా?అయితే విషయాత్మక అంశాలకు గౌరవవేతనాన్ని ఏమైనా భారతవాణి చెల్లిస్తుందా?

  • అవును, ప్రజలు ఉచితంగా ఉపయోగించటం కోసం తాము స్వయంగా రాసిన కాల్పనిక సాహిత్యంకానిది/జ్ఞానాత్మక విషయాన్ని సమర్పించవచ్చు. గ్రంథకర్త అందించిన తోడ్పాటుకు తగిన గుర్తింపును ఇవ్వబడుతుంది. ఇలాంటి విషయాత్మక సామాగ్రిని సంపాదక సమితి (editorial committee) సమ్మతితో మాత్రమే అంగీకరించటం జరుగుతుంది.
  • మీ మాతృభాషలో విషయాత్మక అంశాలను సమర్పించే విధంగా అనుగుణమైన అంతర్జాల పరికరాలను భారతవాణి అందుబాటులో ఉంచుతుంది.
  • విషయాత్మక అంశాల ప్రత్యక్ష ఉపయోగాన్ని అనుసరించి గౌరవవేతన ధరలను సలహా సంఘం నిర్ణయిస్తుంది.  ఆ విషయాత్మక సామాగ్రి యొక్క మౌలికత మరియు ప్రత్యేకతల ఆధారంగా ధరలను నిర్ణయిస్తారు.

అంగవికలురకు భారతవాణి ఏవిధంగా అందుబాటులో ఉంటుంది?

  • భారతవాణి మహాద్వారం (portal) అభివృద్ధి చేసేటప్పుడు భారతప్రభుత్వ దిశా నిర్దేశాలను పాటిస్తూ అంతర్జాతీయంగా ఆమోదనీయమైన సులభతర ప్రమాణాలనూ అనుసరిస్తూ నిర్మిస్తుంది.
  • భారతవాణి వెబుసైటులో ఉన్న విషయ సామాగ్రిని అంధులకు ఉపయోగకరంగా చదివి వినిపించటానికి ముద్రిత (text) రూపం నుండి మాట (speech) రూపంలో వచ్చే విధంగా ఉచిత ప్రయోజనాన్ని అందుబాటులో ఉన్న భాషలలో కల్పిస్తుంది.

భారతవాణి నుండి సమాచారాన్ని ఎవరైనా దొంగిలిస్తే ఏమౌతుంది?

  • భారతవాణి ప్రజలను సహజంగా విశ్వసిస్తుంది. భారతవాణికి చెందిన విషయాత్మక అంశాలు గ్రంథచౌర్యానికి గాని తప్పుగా ఉపయోగించటం గాని కంటపడితే వెంటనే భారతవాణి దృష్టికి తేగలరు.  భారతవాణి తమ ఆధీనంలో ఉన్న విషయాత్మక అంశాలను ఉపయోగించుకొని భాషలు నేర్చుకోవటాన్ని మరియు వ్యాపింపచేయటాన్ని, అదీ సుసంపన్నమైన భారతీయ భాషాపరమైన మరియు సాంస్కృతిక వారసత్వాన్ని పరిరంక్షించే విధంగా మాత్రమే ప్రోత్సహిస్తుంది.

 భారతవాణి పరిపాలన వ్యవస్థ ఏమిటి ?

భారతవాణి ఈ విధంగా నడుస్తుంది:

  • భాషాకోవిదులు మరియు జ్ఞానకోవిదులు, నిపుణులతో కూడిన జాతీయ సలహా సంఘం ఏర్పడుతుంది.
  • ఒక సాంకేతిక సలహా సంఘం మహాద్వారం (portal) మరియు భాషా పరికరాలకు (language tools) చెందిన సాంకేతిక అంశాలలో మార్గనిర్దేశనం చేస్తుంది.
  • భారతవాణిలో పొందుపరిచె విషయాల కోసం భాషలవారిగా సంపాదకీయ సమితి ఉంటుంది.

భారతవాణి ఎక్కడ ఉంది?

  • కర్ణాటకలోని మైసూరు నగరంలో ఉన్న భారతీయ భాషల సంస్థ ప్రాంగణంలో భారతవాణి యోజన ఉంది.

తపాలా చిరునామా:

భారతవాణి యోజన,

భారతీయ భాషల సంస్థ,

మానసగంగోత్రి,

హుణ్ సూరు రోడ్డు,

మైసూరు – 570 006

దూరవాణి:+91-821-2515820 (సంచాలకులు)

రిసెప్షన్/PABX: +91-821-2345000

ఫ్యాక్స్: +91-821-2515032 (కార్యాలయం)

ఈ- టపా: info@bharatavani.in

Search Dictionaries

Loading Results

Follow Us :   
  భారతవాణి ఆప్ ను దిగుమతి చేసుకోండి
  Bharatavani Windows App